Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

కరువును రాయలసీమ బ్రతుకు సమస్యగా గుర్తించాలి

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రాయలసీమలో నెలకొన్న కరువును రాజకీయ సమస్యగా కాకుండా రాయలసీమ బ్రతుకు సమస్యగా గుర్తించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్బొజ్జ దశరథరామిరెడ్డి కోరారు.

మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచి తద్వారా కెసి కెనాల్‌, తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, హంద్రినివాలకు నీరు అందించాలని డిమాండ్చేశారు. నీటి మట్టం 854 అడుగులు ఉంచి రాయలసీమను ఆదుకోవాలనే డిమాండ్తో ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు, సమావేశాలు, ధర్నాలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. గత మే 31 వేలాది మంది రైతాంగంతో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామన్నారు. నీటి మట్టం 854 అడుగులు ఉంచాలని, వైఎస్ఆర్సిపి అధినాయకుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్చేయడం జరుగుతుందన్నారు. అలాగే కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి చేపట్టిన పాదయాత్రను రైతాంగం ఆలోచిస్తుందన్నారు. రాయలసీమను పరిరక్షించేందుకు ప్రత్యేక ఇరిగేషన్కమీషన్కొరకు పోరాడాలని రైతాంగం కోరుకుంటుందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, ఎల్ఎన్సి, హెచ్ఎల్సి, బైరవాని తిప్ప స్థిరీకరణ, గుండ్రేవుల రిజర్వాయర్‌, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించడంపై నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని రైతాంగం అన్ని రాజకీయ పార్టీలను కోరుతుందన్నారు.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found