Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘జనతా గ్యారేజ్’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (2 Votes)

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నజనతా గ్యారేజ్భారీ అంచనాల మధ్య రోజే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.

దీని ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

ముందుగా కథతో మొదలుపెడితే.. హైదరాబాద్లోజనతా గ్యారేజ్పేరుతో ఒక మెకానిక్ షెడ్డు నడిపే పెద్ద మనిషి.. ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేడు. ఎక్కడ అన్యాయం జరిగినా తన అనుచరులతో కలిసి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దే పెద్ద మనిషికి అభిమానులతో పాటు శత్రువులూ పెరుగుతారు. శత్రువుల దాడిలో పెద్ద మనిషి తమ్ముడు, అతడి భార్య ప్రాణాలు కోల్పోతారు. వాళ్ల కొడుకును అతడి మావయ్యా తీసుకెళ్లిపోతాడు. పిల్లాడు పెరిగి పెద్దవాడై తిరిగి.. అనుకోకుండా తన పెదనాన్న ఉండే హైదరాబాద్‌కే వస్తాడు. ఆయనకే అనుచరుడిగా మారతాడు. వీళ్లిద్దరూ కలిసిజనతా గ్యారేజ్‌ను ఎక్కడిదాకా తీసుకెళ్లారు.. క్రమంలో వారికి ఎదురైన ఆటంకాలేంటి.. అన్నది మిగతా కథ.

సామాన్యుడైన హీరో అనుకోకుండా ఒక అన్యాయాన్ని ఎదిరించడం.. జనాల్లో హీరో అయిపోవడం.. ఇక అందరూ సాయం కోసం అతడి దగ్గరికి రావడం.. అతను విలన్లకు శత్రువుగా మారడం.. ఛట్రంలో ఇరుక్కుపోవడం.. ఇదంతా ఎప్పట్నుంచో తెలుగు సినిమాల్లో చూస్తున్న ఫార్ములానే. దీన్నే కొంచెం అటు ఇటుగా మార్చి.. ఇద్దరు కథానాయకుల కథగా తీర్చిదిద్దాడు కొరటాల. కథ రొటీనే అయినా.. మోహన్ లాల్ పాత్రకు లీడ్ ఇచ్చి.. ఎన్టీఆర్‌ను ఉప పాత్రగాగ్యారేజ్లోకి తీసుకురావడం ఇక్కడ భిన్నమైన విషయం. ఎన్టీఆర్‌ను ప్రకృతి ప్రేమికుడిగా చూపించడం.. అతడి పాత్రను భిన్నంగా ప్రెజెంట్ చేయడంలోనూ కొరటాల కొత్తదనం చూపించాడు. కాకపోతే.. సినిమానుతనదైనశైలిలో మరీ నెమ్మదిగా నడిపించడం.. ఒక దశలో మంచి ఊపందుకున్న సినిమాను రొటీన్ ఆలోచనలతో కింద పడేయడం.. మామూలుగా ముగించడంతో వచ్చింది సమస్య. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో పోల్చుకుని చూస్తే.. భారీ అంచనాల కళ్లతో వీక్షిస్తే మాత్రం నిరాశ తప్పదు. అలా కాకుండా చూస్తే ఇందులో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. వాటితో సంతృప్తి పడొచ్చు. ‘జనతా గ్యారేజ్పర్ఫెక్షన్ ఉన్న సినిమా కాదు. ఇందులో ప్లస్సులెన్ని ఉన్నాయో.. మైనస్సులూ అన్నే ఉన్నాయి.

జనతా గ్యారేజ్ విషయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన విషయం ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషనే. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే అంచనాలకు తగ్గట్లే మంచి సన్నివేశాలే పడ్డాయి సినిమాలో. ఇద్దరూ కలిసే తొలి సన్నివేశమే గొప్పగా అనిపిస్తుంది. ఇద్దరి స్థాయికి తగ్గట్లుగా చక్కగా సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు కొరటాల. అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంతోనేజనతా గ్యారేజ్సినిమా మొదలవుతుందంటే అతిశయోక్తి కాదు. అప్పటిదాకా పాత్రల పరిచయానికి.. కొన్ని సాదాసీదా సన్నివేశాలు.. మూడు పాటలకే స్క్రీన్ టైం చాలా వరకు ఖర్చవుతుంది. ఎన్టీఆర్ పాత్ర వరకు బాగున్నా.. ప్రథమార్ధంలో వచ్చే మిగతా సన్నివేశాలేవీ కూడా అంత ఆసక్తి రేకెత్తించవు. తారక్-లాల్ కలిసే తొలి సన్నివేశం మాత్రం భలేగా అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ మారి.. సీరియస్‌గా సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు ప్రేక్షకులు. ఇక ద్వితీయార్ధం అంచనాలకు తగ్గట్లే చక్కగా ఆరంభమవుతుంది. ‘ఎక్కడ ఆగిందో అక్కడే మొదలుపెడదాంఅంటూ రాజీవ్ కనకాల పాత్రను తెరమీదికి తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకుడిలో ఊపు.. ఉత్తేజం వస్తాయి. రాజీవ్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎపిసోడ్ 20 నిమిషాలు ప్రేక్షకుడు తెరకు కళ్లు, చెవులు అప్పగించేయాల్సిందే. ఎపిసోడ్ అంత బాగా పండింది. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఇక్కడే తెలుస్తుంది. అతడి నటనలోని ఇంటెన్సిటీని ప్రతి ప్రేక్షకుడూ ఫీలవుతాడు. కొరటాల మాటలు తూటాల్లా పేలాయి ఇక్కడ. ఎమోషన్ అద్భుతంగా పండిన సన్నివేశం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. తర్వాత వచ్చే టైటిల్ సాంగ్.. ఎన్టీఆర్ ఎవరో మోహన్ లాల్‌కు తెలిసే సన్నివేశం కూడా చాలా ఉద్వేగంగా సాగుతాయి. ఐతే ఇక్కడే కొరటాల సంతృప్తి పడిపోయినట్లున్నాడు. ఏదో ఒక రొటీన్ క్లైమాక్స్‌తో ముగించేద్దామని చూశాడతను. ఎంతో ఎమోషనల్‌గా నడుస్తున్న సినిమా కాస్తా.. రొటీన్ కమర్షియల్ సినిమాల్లాగా టర్న్ తీసుకుని అనాసక్తికరంగా సా..గడం మొదలుపెడుతుంది. దీంతో చివరి అరగంటలో సినిమా గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతుంది. అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను దెబ్బ తీసింది తప్ప చివరి అరగంట సినిమాకు రకంగానూ ఉపయోగపడలేదు. అంతకుముందు ఒక్కసారిగా పైకి లేచిన సినిమాకాస్తా.. చివర్లో ఒక్కసారిగా కింద పడుతుంది. ఓవరాల్‌గా బాగుందనిపిస్తూనే.. కొంచెం అసంతృప్తినీ మిగిలుస్తుందిజనతా గ్యారేజ్’. కొరటాల గత రెండు సినిమాల్లో నెగెటివ్ పాయింట్లు తక్కువ. పాజిటివ్స్ ఎక్కువ. కానీజనతా గ్యారేజ్‌లో రెండూ బ్యాలెన్స్ అయి.. ఇది యావరేజ్ ఫీలింగ్ కలిగిస్తుంది.

హీరోయిన్ల పాత్రల్ని కొరటాల ఎందుకు అస్సలు వాడుకోలేదో అర్థం కాదు. సమంత, నిత్యామీనన్ ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. ఇద్దరికీ మొక్కుబడిగా చెరో మూణ్నాలుగు సీన్లు ఇచ్చారు. అవి చాలా మామూలుగా అనిపిస్తాయి. సమంతతో తారక్ రొమాంటిక్ ట్రాక్ ఎందుకూ కొరగాకుండా పోయింది. నిత్యామీనన్ పరిస్థితి మరీ ఘోరం. మోహన్ లాల్ పాత్ర అంత గొప్పగా లేదు కానీ.. ఆయన నటన మాత్రం అమోఘం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కాజల్ ఐటెం సాంగ్ సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్. పాటలో ఎన్టీఆర్‌ను కాజల్ పూర్తిగా డామినేట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. విలన్ల పాత్రలు అంతగా ఆసక్తి రేకెత్తించవు. అవే సినిమాకు మైనస్. ఉన్ని ముకుందన్, సచిన్ ఖేద్కర్ మామూలుగా అనిపిస్తారు. దేవిశ్రీ పాటలు.. నేపథ్య సంగీతం బాగున్నాయి. తిరు ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. కొరటాల శివ మాటల రచయితగా మంచి మార్కులేయించుకుంటాడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా డీల్ చేశాడు. ఐతే రొమాన్స్.. ఎంటర్టైన్మెంట్ పార్ట్‌లో తేలిపోయాడు. అతను క్లైమాక్స్ విషయంలో రాజీ పడిపోవడం నిరాశ కలిగిస్తుంది. దర్శకుడిగా అతడీసారి యావరేజ్ మార్కులే వేయించుకుంటాడు.

చివరగా ఒక మాట.. ఇది కొంత నిరాశ పరిచే సినిమానే కానీతప్పకుండా చూడటానికి కారణాలు కూడా సినిమాలో చాలా ఉన్నాయి.

 

రేటింగ్- 2.75/5

Leave your comments

Post comment as a guest

0

People in this conversation