Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘ఆటాడుకుందాం రా’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 1.50 (1 Vote)

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా పరిచయమై దశాబ్దం అవుతోంది. తొలి సినిమా కాళిదాసు.. తర్వాత వచ్చిన కరెంట్, అడ్డా.. మూడూ కూడా నిరాశ పరిచాయి.

సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నా ఫలితం దక్కట్లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్న సుశాంత్.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్టు ప్రసాదిస్తాడని పేరున్న కామెడీ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డిని నమ్ముకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కినఆటాడుకుందాం రా రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

అనగనగా పెద్ద మనిషి. వ్యాపారంలో భారీగా సంపాదిస్తూ మంచి స్థాయిలో ఉంటాడు. కానీ అతడి శత్రువు అతణ్ని దెబ్బకొట్టి ఆస్తి మొత్తం పోయేలా చేస్తాడు. క్రమంలో తన మిత్రుడే తనను మోసం చేశాడని అపార్థం చేసుకుని అతణ్ని దూరం పెడతాడా పెద్ద మనిషి. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత తన తమ్ముడి కూతురి పెళ్లి చేయడానికి తన కుటుంబానికి ఆధారంగా ఉన్న రైస్ మిల్లు అమ్మేయడానికి సిద్ధపడతాడు పెద్దాయన. కానీ విలన్ ప్రయత్నాల్ని కూడా అడ్డుకుంటాడు. అప్పుడు పెద్ద మనిషి అల్లుడైన హీరో విదేశాల నుంచి దిగుతాడు. విలన్ పని పడతాడు. పెద్దాయనను అన్ని రకాలుగా ఆదుకుంటాడు. ఐతే హీరో ఇలా చేయడం వెనుక కథ ఉంటుంది. కథ ఏంటన్నది తెరమీదే చూడాలి.

తెలుగు సినిమాలు మారిపోయింది మారిపోయింది అంటుంటాం కానీ.. ‘ఆటాడుకుందాం రాచూసినపుడే డౌట్ కొడుతూ ఉంటుంది. రొటీన్ సినిమాలు వద్దు మొర్రో అంటూ ప్రేక్షకులు తిప్పి తిప్పి కొడుతున్నా సరే.. మన ఫిలిం మేకర్స్ ఎందుకు మారట్లేదో.. ఇన్నేసి కోట్లు ఖర్చుపెట్టి రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తారెందుకో అర్థం కాదు. రెండు గంటల 20 నిమిషాల నిడివిలో అణువంతైనా కొత్తదనం కనిపించని సినిమాఆటాడుకుందాం రా’. కథలో ఇమిటేషన్.. పాత్రల విషయంలో ఇమిటేషన్.. రొమాంటిక్ సీన్స్ విషయంలో ఇమిటేషన్.. పాటల విషయంలో ఇమిటేషన్.. కామెడీ విషయంలో ఇమిటేషన్.. ఇలా సినిమా అంతా కూడా ఏదో ఒక పాత సినిమాను తలపిస్తూనే ఉంటుంది. స్టీరియో టైపు కథాకథనాలతో ఆద్యంతం రొటీన్‌గా సాగిపోతుందీ సినిమా. బ్రహ్మానందంను ఇంకెన్ని సార్లు బకరాను చేస్తారు.. అతణ్ని వాడుకుని విలన్ని హీరో ఇంకెన్నిసార్లు మోసం చేస్తాడు.. బ్రహ్మి అంత గుడ్డిగా ఇంకెన్నిసార్లు మోసపోతాడో మన రచయితలు, దర్శకులకే తెలియాలి. ఆగడు, బ్రూస్ లీ లాంటి సినిమాలు ఫార్ములా కామెడీ వల్ల ఏమయ్యాయో.. సినిమాల్ని చూసి జనాలు ఎంత ఫ్రస్టేట్ అయ్యారో ఇంకా శ్రీధర్ సీపానకు, నాగేశ్వరరెడ్డికి ఎందుకు అర్థం కాలేదో మరి. వాళ్ల సంగతి సరే..ఇప్పటికే పదుల సంఖ్యలో అలాంటి పాత్రలు చేసి.. అవి మొహం మొత్తడం వల్ల తన కెరీరే దెబ్బ తినే స్థితికి వచ్చినా బ్రహ్మి క్యారెక్టర్ని మళ్లీ ఎందుకు ఒప్పుకున్నాడో? బ్రహ్మిని వాడుకుంటే సరిపోదని.. రైజింగ్‌లో ఉన్న పృథ్వీని కూడా ఇలాగే వాడేశారు. కాకపోతే సినిమాలో ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయంటే పృథ్వీ, బ్రహ్మిల కామెడీ ఎపిసోడ్లే. వాటిలోనే అంతో ఇంతో నవ్వుకుంటాం. కామెడీని మినహాయించి చూస్తే అసలు సినిమాలో ఏమీ లేదు.

సరైన డిక్షన్, బాడీ లాంగ్వేజ్ లేని సుశాంత్‌ను చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. అతను డైలాగ్ పలుకుతుంటే నీరసం వస్తుంది. నాగార్జున ఫ్యామిలీ హీరోల సినిమాల్లో మామూలుగా సెల్ఫ్ డబ్బా ఉండదు. కానీ సుశాంత్ మాత్రంఅక్కినేనిభాజా బాగా మోగించాడు. పదే పదే అక్కినేని ఫ్యామిలీ ప్రస్తావన తీసుకొస్తూ.. తన మావయ్యను అనుకరిస్తూ అభిమానులకు వల వేశాడు సుశాంత్. కానీ ప్రయత్నం బెడిసికొట్టింది. అఖిల్ డ్యాన్స్ కానీ.. చైతూ క్యామియో రోల్ కానీ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. హీరోయిన్ సోనమ్ జ్వా సుశాంత్‌కు గ్గ జోడీనే. ఆమె అందంలో కానీ.. లో కానీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. మెడియన్లు పృథ్వీ, బ్రహ్మి ఏదో కాలక్షేపం చేయించడానికి వంతు ప్రత్నం చేశారు కానీ లితం లేకపోయింది. మిగతా టీనటులంతా కూడా మామూలే. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాకు టెక్నీషియన్స్ మాత్రం ఏం చేయరు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రొటీన్‌గా వాయించాడు. కెమెరామన్ కూడా మొక్కుబడిగా ని కానిచ్చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. శ్రీధర్ సీపాన గురించి మాట గురించి.. నాగేశ్వరెడ్డి ర్శత్వం గురించి చెప్పడానికేమీ లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే సుశాంత్‌కు ఈసారి కూడా బ్యాండ్ ప్పదు.

 

రేటింగ్: 2/5

Leave your comments

Post comment as a guest

0

People in this conversation