Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘తిక్క’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 2.00 (1 Vote)

తొలి సినిమానే ఒక పెద్ద డిజాస్టర్ అయినపుడు.. దర్శకుడైనా రెండో సినిమాకు జాగ్రత్త పడతాడు. కొంచె సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తాడు.

కానీ కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి మాత్రం మరోసారి రిస్కే తీసుకున్నాడు. ‘ఓంతర్వాతతిక్కఅనే వైవిధ్యమైన సినిమా తీశాడు. కాకపోతే వైవిధ్యం కోసం అతను చేసిన ప్రయత్నం తిరగబడింది. ప్రేక్షకులకు తిక్క లేచేలా చేసింది.

రెండేళ్ల పాటు ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అయిన కుర్రాడి కథ.. ‘తిక్క’. చక్కగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ గడిపేస్తున్న కుర్రాడి జీవితంలోకి అమ్మాయి వస్తుంది. ఆమె రాగానే అతడికి స్నేహితులు దూరమైపోతారు. అతడి అలవాట్లన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. దీంతో నెమ్మదిగా ఇద్దరి మధ్య అంతరం పెరుగుతుంది. క్రమంలోనే కుర్రాడికి ఆమె బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో తన పాత స్నేహితుల్ని దగ్గరికి తీసుకుంది బార్లో సిట్టింగేస్తాడు కుర్రాడు. అక్కడే అతడి జీవితం మరో మలుపు తీసుకుంటుంది. కొందరు కొత్త వ్యక్తులు అతడి జీవితంలోకి వస్తారు.. క్రమంలో ఒక్క రోజు వ్యవధిలో కుర్రాడి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగిందన్నదే మిగతా కథ.

తిక్కహాలీవుడ్ మూవీహ్యాంగోవర్కు కాపీ అని ప్రచారం జరిగింది. చక్కగా పనేదో చేసినా పోయేదేమో. కానీ సునీల్ రెడ్డి హ్యాంగోవర్ లైన్లో తిక్కసినిమా తీశాడు. ఏదో కొత్తగా చేద్దామన్న ప్రయత్నంలో మొత్తం కంగాళీ చేసేశాడతను. ఒక దశా దిశా లేకుండా పోయే సినిమాలో తెరమీద బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి. చాలా హడావుడి చేస్తాయి. కానీ హడావుడి శిరోభారం అవుతుంది తప్ప వినోదాన్నివ్వదు. కామెడీ పేరుతో చేసిన హంగామా అంత తిరగబడి.. భరించలేని హింసలా తయారైంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే కన్ఫ్యూజింగ్ కామెడీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దర్శకుడికి బురఖాల మీద అంత ప్రేమేంటో కానీ.. తెరమీద కనిపించే చాలా పాత్రలకు బురఖాలు తొడిగించేసి ఏదో కామెడీ చేద్దామని ట్రై చేశాడు. కానీ అక్కడ కామెడీ పండక కంగాళీగా తయారైంది. ఐతే సినిమా మొత్తంలో కాస్తో కూస్తో నవ్వించేది ఎపిసోడే అని చెప్పాలి. మామూలుగా కొన్ని చమక్కులు మంచి సినిమాలో పడితే హైలైట్ అవుతాయి. అలా కానపుడు వృథా అయిపోతాయి. ‘తిక్కలో కూడా అలాంటి కొన్ని చమక్కులు వృథా అయిపోయాయి. సప్తగిరి-తాగుబోతు రమేష్-సత్య కాంబినేషన్లో వచ్చేకామెడీ సీన్.. చివర్లో వెన్నెల కిషోర్ గే కామెడీ అలాంటివే. కానీ అప్పటిదాకా గందరగోళంగా సాగిన కథనంతో తిక్క రేగి ఉన్న ప్రేక్షకులు.. సన్నివేశాల్ని కూడా ఎంజాయ్ చేసే స్థితిలో ఉండరు.

తిక్క ప్రధానంగా ఎంటర్టైన్మెంట్, యాక్షన్ లక్ష్యంగా తీసిన సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉన్నంతలో కాస్త మెరుగే కానీ.. యాక్షన్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ప్రేక్షకుల్ని కంగారు పెడతాయి. అవసరం లేని ఛేజింగ్ సీన్లు.. బ్లాస్టింగులు.. ఊరికే బడ్జెట్ పెంచాయి తప్ప సినిమాకు రకంగానూ ఉపయోగపడలేదు. హీరో సహా సినిమాలో ఎవరికీ సరైన క్యారెక్టరైజేషన్ లేదు. హీరోకు కానీ.. హీరోయిన్కు కానీ.. ఒకరి మీద ఒకరికి అసలు ప్రేముందో లేదో.. అసలిద్దరూ సీరియస్గా ఉన్నారో లేదో అర్థం కాదు. వీళ్లిద్దరూ ప్రేమలో పడటానికి కూడా ఒక కారణమంటూ కనిపించదు. సినిమా అంతటా పాత్రలకైతే కొదవలేదు. పదుల సంఖ్యలో నటులతో తెర నిండిపోయి ఉంటుంది కానీ.. ఎవ్వరూ అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయారు. ఒక్క రోజులో ముగిసిపోయే కథ అంటే స్క్రీన్ ప్లే చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఐతేతిక్కలో అది లేదు. ఊరికే హడావుడి.. గందరగోళం.. దశలో గోల భరించలేక చెవుల తుప్పు వదితలిపోతుంది. వరుసగా మంచి సినిమాలు చేస్తున్న సాయిధరమ్.. ఇలాంటి కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దర్శకుడు సునీల్ రెడ్డి కూడా ఒక డిజాస్టర్ తర్వాత ఇలాంటి అర్థరహితమైన కథను ఎలా ఎంచుకున్నాడో అర్థం కాదు. సినిమా మొత్తంలో బాగా ఆకట్టుకునేది తమన్ సంగీతం మాత్రమే. అతను మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలకూ ఢోకా లేదు. ఎటొచ్చీ కథాకథనాలే తేడా కొట్టేశాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు తిక్కరేగడం మాత్రం ఖాయం.

 

రేటింగ్: 1.5/5

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - anuj

    good Through this app you can watch free video, TV shows, Mobdro Latest recommend videos to all your buddies and let your friends nice.

    0 Like Short URL: