Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘బాబు బంగారం’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 2.00 (1 Vote)

మారుతి-వెంకటేష్.. చాలా ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్ ఇది. వీళ్లిద్దరూ కలిసి చేసినబాబు బంగారంపై మొదట్నుంచి ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. విడుదలకు ముందు అంచనాలు మరింత పెరిగాయి.

మాంచి హైప్ మధ్య రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. మరి బాబు అంచనాల్ని అందుకున్నాడా.. ప్రేక్షకులతోనూబాబు బంగారంఅనిపించుకున్నాడా.. చూద్దాం పదండి.

క్రిమినల్స్ను కొట్టి.. తర్వాతే తన దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించి.. వాళ్లకు బాగవ్వాలని హోమాలు చేయించేంత జాలిగుండె ఉన్న ఏసీపీ కృష్ణ (వెంకటేష్).. కష్టాల్లో ఉన్న శైలజ (నయనతార) అనే అమ్మాయిని చూసి జాలి పడి ఆమె ఇబ్బందులు తీర్చడానికి సిద్ధమవుతాడు. క్రమంలో ఆమెది కూడా తనలాగే జాలి గుండె అని తెలిసి ప్రేమిస్తాడు. ఐతే హత్య కేసులో చిక్కుకుని ఇటు పోలీసులకు, అటు రౌడీలకు దొరక్కుండా తిరుగుతున్న తన తండ్రి కోసం శైలజ బాధపడుతోందని తెలిసి విషయంలో ఆమెకు సాయపడ్డానికి ప్రయత్నిస్తాడు కృష్ణ. దీంతో శైలజ కూడా కృష్ణను ప్రేమిస్తుంది. ఐతే తనను కలవడం.. ప్రేమించడం వెనుక కృష్ణకు తన తండ్రిని పట్టుకోవాలన్న టార్గెట్ ఉందని తెలిసి.. అతణ్ని చీదరించుకుంటుంది శైలజ. మరి పరిస్థితుల్లో కృష్ణ ఆమెలోని అపార్థాన్ని ఎలా తొలగించాడు.. శాస్త్రిని ఏం చేశాడు.. ఆయన్ని హత్య కేసులో ఇరికించిన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది మిగతా కథ.

ఒక పోలీస్.. తన ఐడెంటిటీని దాచేసి అమ్మాయి ప్రేమకోసం వెంట పడటం.. చివరికి ఆమె వెంట పడటం వెనుక అసలు కారణం హత్య చేసి తిరుగుతున్న ఆమె తండ్రి కావడం.. వరసంతా చూస్తే 90ల్లో వచ్చిన నాగార్జున సినిమానిర్ణయంగుర్తుకు రాకమానదు. మధ్యేమీనాసినిమాను గా మార్చి మంచి త్రివిక్రమ్ మంచి ఫలితాన్ని అందుకుంటే.. అదే బాటలో మారుతి కూడా పయనించాడు. కానీ ఇక్కడ ఫలితం తేడా కొట్టేసింది. నిర్ణయం ఎంత ఎంటర్టైన్ చేస్తుందోబాబు బంగారంఅంత బోరింగ్గా సాగుతుంది. ఇందులోని తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్స్టోరీకి కానీ.. హీరో హీరోయిన్ ప్రేమకథకు కానీ.. ప్రేక్షకులు కనెక్టవ్వరు.

కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా సరిగా పండిందా అంటే అదీ లేదు. మారుతి గత సినిమాలన్నింటికీ హైలైట్‌‌గా నిలిచిన ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇందులో తేలిపోయింది. టీజర్..ట్రైలర్లలో కనిపించినవన్నీ పైపై మెరుపులే. వెంకీ నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి తరహాలో వినోదం పండించేస్తాడని ఆశిస్తాం కానీ.. ఆయన పాత్ర సినిమాకు మైనస్ అయింది. వెంకీ అందంగా.. హుందాకా కనిపించాడు.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ.. ఆయన్నుంచి ఆశించిన వినోదం మాత్రం లేదు. జాలి గుణం ఉన్న పోలీసుగా వినోదం పండించడానికి మంచి అవకాశం ఉన్నా.. మారుతి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్యారెక్టరైజేషన్ బాగున్నా.. సరైన సన్నివేశాలు రాసుకోకపోవడంతో వెంకీ పాత్ర నిరాశ పరుస్తుంది. ప్రేమకథ ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగగా.. బత్తాయి కాయల బాబ్జీగా పృథ్వీ మాత్రం మోస్తరుగా నవ్వించడంతో ప్రథమార్ధం పర్వాలేదనిపిస్తుంది. ఇక కొంచెం సీరియస్గా సాగే ద్వితీయార్ధం కూడా మెప్పించలేదు. అటు వినోదమూ పండక.. అటు  క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ అల్లుకున్న కథనమూ కూడా అంతగా ఆకట్టుకోకబాబు బంగారంబండి కష్టంగా కదులుతుందివిషయం లేని కథను రెండున్నర గంటల పాటు సాగదీయడంతో చాలా చోట్ల ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు.

ప్రథమార్ధంలో పృథ్వీ పాత్ర చుట్టూ వచ్చే రెండు మూడు సన్నివేశాలు.. ద్వితీయార్ధంలో పోసాని ఎపిసోడ్.. క్లైమాక్స్లో వెంకీబొబ్బిలిరాజాగా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పర్వాలేదనిపిస్తాయి. సినిమాలో చెప్పుకోదగ్గ హైస్ అయితే ఏమీ లేవు. ఎంటర్టైన్మెంట్ తక్కువైనా కుటుంబ ప్రేక్షకుల్ని మోస్తరుగా మెప్పించే క్లీన్ ఫ్యామిలీ మూవీ కావడంబాబు బంగారంకు ప్లస్ కావచ్చు. వెంకీ అభిమానులు ఆయన్ని ఒకప్పట్లా మాస్ పాత్రలో చూసి కొంత సంతోషించొచ్చు. సగటు ప్రేక్షకుడికి మాత్రంబాబు బంగారంనిరాశనే మిగులుస్తుంది. జిబ్రాన్ సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగానే కుదిరాయి. వెంకీ తన వరకు కొంచెం ఎంటర్టైన్ చేశాడు. ఆయన లుక్ బాగుంది. నయనతారను చూసి ఆమె అభిమానులు నిరాశకు గురవుతారు. ఆమె గ్లామర్ పోయి అదోలా తయారైంది. యాక్టింగ్ టాలెంట్ చూపించేంత పాత్రమే కాదిది. మిగతా వాళ్లంతా మామూలే. మొత్తానికి క్రేజీ కాంబినేషన్తో ఆసక్తి రేకెత్తించినబాబు బంగారంఅంచనాల్ని అందుకోలేకపోయింది.

 

రేటింగ్: 2.5/5

Leave your comments

Post comment as a guest

0
  • No comments found