Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘మనమంతా’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 4.00 (1 Vote)

ఐతే.. అనుకోకుండా ఒక రోజు.. ఒక్కడున్నాడు.. ప్రయాణం.. సాహసం.. ఇవన్నీ వేటికవే భిన్నమైన సినిమాలు. అలాగే కొత్తదనం ఉన్న సినిమాలు. వరస చూసే చెప్పేయొచ్చు చంద్రశేఖర్ యేలేటి అంటే ఏంటో? ప్రతిసారీ వైవిధ్యం చూపించడానికి..

ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి ప్రయత్నించే యేలేటి.. ‘సాహసంతర్వాత చాలా గ్యాప్ తీసుకునిమనమంతాసినిమాతో వచ్చాడు. మరి యేలేటి తనకున్న బ్రాండ్ వాల్యూని యేలేటి ఈసారి కూడా నిలుపుకున్నాడా.. మరో వైవిధ్యమైన సినిమాను అందించాడా.. చూద్దాం పదండి.

కొందరు వేర్వేరు వ్యక్తుల జీవితాల్ని సమాంతరంగా చూపించడం.. చివరికి వ్యక్తులందరినీ ఒక చోటికి చేర్చి పతాక సన్నివేశంతో ముగించడం.. తరహాలో ఇంతకుముందు వేదం, చందమామ కథలు లాంటి సినిమాలు వచ్చాయి. మనమంతా కూడా తరహా సినిమానేసూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తూ ప్రమోషన్ కోసం తపించే వ్యక్తి.. ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో సరుకులు తక్కువ ధరకు ఇస్తారని తెలిసి డబ్బులు మిగులుతాయని అంత దూరం వెళ్లిపోయే మనస్తత్వం ఉన్న ఇల్లాలు.. చక్కగా చదువుకుంటూ ఉన్నట్లుండి అమ్మాయి ప్రేమలో మైకంలో పడి అన్నీ వదిలేసిన కుర్రాడు.. సాయం చేయడంలోనే ఆనందం ఉందని భావించే స్కూల్ అమ్మాయి.. నలుగురి మధ్య సాగే కథ ఇది. వీళ్ల మధ్య యేలేటి ఎలా బంధం కలిపాడు.. నాలుగు కథల్ని ఎలా ముగించాడు అన్నది చెప్పేస్తే థ్రిల్ పోతుంది.

యేలేటి ఇప్పటిదాకా చేసిన సినిమాలకుమనమంతాపూర్తి భిన్నంగా ఉంటుంది. గమ్యం, వేదం తరహాలో ఇదిమనిషికి సంబంధించిన సినిమా. ఎమోషన్లే ప్రధానంగా సాగుతుంది. నిజానికి తరహా కథలతో మెప్పించడం కష్టం. ఎమోషన్లు సరిగా పండకపోతే.. పాత్రల తాలూకు భావోద్వేగాల్ని ప్రేక్షకులు ఫీలవ్వకపోతే పడ్డ కష్టమంతా వృథా అయిపోతుంది. ఐతే యేలేటి విషయంలో ప్రేక్షకుల మనసులు గెలిచాడు. మధ్య తరగతి జీవితాల్లోని లోతుల్ని సరిగ్గా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకులు ఆయా పాత్రలతో కనెక్టయ్యేలా చేయగలిగాడు. ముఖ్యంగా మోహన్ లాల్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సగటు మధ్య తరగతి జీవికి ప్రతిబింబంలా అనిపించే పాత్రతో సినిమా అంతా ట్రావెట్ చేస్తారు ప్రేక్షకులు. అతను సమస్యలో చిక్కుకుని సంఘర్షణకు గురవడం మొదలుపెట్టాక.. సంఘర్షణను ప్రేక్షకుడు కూడా ఫీలవుతాడు. మరోవైపు బేనీ రైనా పాత్ర కూడా బాగా పండింది. గౌతమి పాత్ర కూడా బాగానే కుదిరింది. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగినా.. చివరికి వచ్చే సరికి పాత్ర వెయిట్ బాగా పెరిగింది. ఎటొచ్చీ యేలేటి చూపించిన ప్రేమకథే చాలా సాదాసీదాగా.. బోరింగ్‌గా ఉంది. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ వరకు కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకపోవడంతో అంతా మామూలుగా అనిపిస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో యేలేటి ముద్ర కనిపిస్తుంది.

దశ వరకు మామూలుగా అనిపించినా.. క్రమ క్రమంగా ఎమోషన్‌తో గుండె బరువెక్కేలా కథనాన్ని తీర్చిదిద్దాడు యేలేటి. నాలుగు వేర్వేరు కథల్ని వేర్వేరుగా చెప్పడంలో కంటే కూడా వాటిని ఒకచోటికి చేర్చి ముగించడంలో యేలేటి ప్రత్యేకత కనిపిస్తుంది. ‘మనమంతాసినిమాకు పతాక సన్నివేశాలే ప్రధాన ఆకర్షణ. అందులో ఎమోషన్లు పండించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివరి 20 నిమిషాల్లో ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు యేలేటి. ప్రధాన పాత్రధారుల సమస్యల్ని పరిష్కరిస్తూ.. ప్రేక్షకులను కన్విన్స్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం ప్రేక్షకుల మూడ్‌ను రిప్రెజెంట్ చేస్తుంది. మల్టిపుల్ స్టోరీ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు ఇది వరకే పరిచయం అయినా.. స్క్రీన్ ప్లేలు రాయడంలో స్పెషలిస్టు అయిన యేలేటి.. తన ముద్రను చూపించేలా మ్యాజిక్ చేశాడుమనమంతాలో. అదేంటన్నది తెరమీదే చూడాలి. మహేష్ శంకర్ సంగీతం..  రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం సినిమాకు చక్కగా కుదిరాయి. యేలేటి ఆలోచనలకు తగ్గట్లుగా నటీనటులందరూ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన్ లాల్ సాయిరాం పాత్రకు నిండుదనం తెచ్చారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. సహజమైన నటనతో పాత్రను.. సన్నివేశాల్ని రక్తికట్టించారాయన. బేబీ రైనా రావు కూడా మెస్మరైజ్ చేస్తుంది. గౌతమి, విశ్వాంత్ కూడా బాగానే నటించారు. గొల్లపూడి హుందాగా నటించారు. అనీషా ఆంబ్రోస్ పర్వాలేదు. కథనం నెమ్మదిగా సాగడం వల్ల అక్కడక్కడా బోర్ కొట్టినా.. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్‌గా మాత్రంమనమంతామంచి ఫీలింగే కలిగిస్తుంది. ఇందులోని ఎమోషన్లతో కనెక్టయ్యేవాళ్లు సంతృప్తిగా బయటికి వస్తారు. రచయితగా, దర్శకుడిగా యేలేటి తన పతాక స్థాయిని అందుకోలేదు కానీ.. నిరాశపరచనైతే లేదు. ఎమోషన్లతో నిండిన ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకునేవాళ్లకుమనమంతామంచి ఛాయిస్.

 

రేటింగ్: 3/5

Leave your comments

Post comment as a guest

0
  • No comments found