Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

‘పెళ్లిచూపులు’ రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 5.00 (1 Vote)

ఒక కొత్త దర్శకుడు పరిశ్రమలోకి వస్తున్నాడంటే ఎంతో కొంత కొత్తదనం ఆశిస్తాం. కానీ రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే వాళ్లనే నిర్మాతలు నెత్తిన పెట్టుకుంటునే మన పరిశ్రమలో కొత్త దర్శకులందరూ కూడా పాత బాటలోనే నడుస్తున్నారు.

కానీ గత కొన్నేళ్లలో తెలుగు సినిమా మారుతోంది. కొత్తదనానికి పట్టం కడుతోంది. నేపథ్యంలో టాలీవుడ్లోకి కొత్త దర్శకుడు సరికొత్త సినిమాతో అడుగుపెట్టాడు. దర్శకుడి పేరు తరుణ్ భాస్కర్. అతను తీసిన సినిమా పెళ్లిచూపులు.

భారీ కథ.. భారీ ఇంటర్వెల్ బ్యాంగ్.. భారీ క్లైమాక్స్.. ఇలాంటివేమీ లేని మామూలు కథతో తెరకెక్కిన సినిమా పెళ్లిచూపులు. అతి కష్టం మీద ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆవారా తిరిగే కుర్రాడు.. ఎంబీఏ పూర్తి చేసి జీవితంలో ఏదో సాధించాలని తపించే అమ్మాయి.. అనుకోకుండా పెళ్లిచూపుల్లో కలుస్తారు. తమ ఆలోచనల్ని పంచుకుంటారు. ఇద్దిరివి పూర్తి భిన్నమైన మనస్తత్వాలు. వేర్వేరు దారులు. వాళ్ల పెళ్లిచూపులు విఫలమైనా.. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి వారి ప్రయాణం ఎలా సాగింది.. మలుపులు తిరిగింది. ఎక్కడిదాకా వెళ్లింది అన్నదేపెళ్లిచూపులుకథ.

పెళ్లిచూపులు ట్రెండీగా.. చాలా కొత్తగా అనిపించే రొమాంటిక్ కామెడీ. ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా మనకు తెలిసిన వ్యక్తుల జీవితాల్ని దగ్గర్నుంచి చూస్తున్న భావన కలిగిస్తుందిపెళ్లిచూపులు’. జీవం ఉన్న పాత్రలతో ఒక ఫీల్ ఇచ్చే సినిమాను అందించాడు కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే అక్కడక్కడా ఎమోషన్లను కూడా ఫీలయ్యేలా చేస్తూ చివరికి ఒక చక్కటి అనుభూతిని మిగిల్చి థియేటర్ నుంచి బయటికి పంపిస్తాడు తరుణ్. కథను చెప్పే విషయంలో అతను ఎంచుకున్న కొత్త పంథా ఆకట్టుకుంటుంది. రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనే అంశాన్ని కథకు కీలకంగా ఎంచుకోవడంతోనేపెళ్లిచూపులుసినిమాను ట్రెండీగా మార్చి.. తరం ప్రేక్షకులకు చేరువ చేశాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంలోనూ తాజాదనం కనిపించే సినిమాలో ఎక్కడా కూడాబోర్ఫీలింగ్ రాదు.

అతి కష్టం మీద బీటెక్ పూర్తి చేసి.. తండ్రి చేత చివాట్లు తింటూ.. బాధ్యత లేకుండా తిరుగుతూనే.. మరోవైపు తన అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకోవడానికి తగ్గ ప్రోత్సాహం దక్కని కుర్రాడు.. పెళ్లీడు రాగానే తంతు ముగించేసి అందరిలా సంసారంలో మునిగిపోకుండా తన కాళ్ల మీద తాను నిలబడి ఉన్నత శిఖరాలకు చేరాలని తపించే ఇండివిడువాలిటీ ఉన్న అమ్మాయి.. ఇలా ఇప్పటి యువతరానికి ప్రతిబింబాల్లా కనిపించే ప్రధాన పాత్రలతో చాలా త్వరగా కనెక్టయిపోతార ప్రేక్షకులు. ప్రధాన పాత్రలకు బలమైన క్యారెక్టరైజేషన్ ఉండటం.. మిగతా పాత్రలు కూడా అర్థవంతంగా ఉండటంతో వాటితో ఈజీగా ట్రావెల్ అయిపోతాం.

ఎక్కడా వినోదానికి ఢోకా లేకుండా బోర్ కొట్టించకుండా కథనం సాగిపోవడంతో సమయం గడుస్తున్న సంగతే తెలియదు. హీరోతో పాటు అతడి స్నేహితులతో పండించిన వినోదం సినిమాకు మేజర్ హైలైట్. ముఖ్యంగా తెలంగాణ యాసతో నవ్వుల జల్లును పంచిన ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా చివర్లోనా చావు నేను చస్తా.. నీకెందుకుఅంటూ అతను డైలాగ్ చెప్పే తీరుకు నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ప్రథమార్ధంలో హీరో అతడి ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య వచ్చే యూట్యూబ్ కామెడీ కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. హీరో హీరోయిన్ ఇంటికెళ్లి ఆమె తండ్రిలో రియలైజేషన్ వచ్చేలా చేసే సీన్లో ఎమోషన్ బాగా పండింది. హీరో చాలా క్యాజువల్ గా తరం యూత్ లాగా చెబుతున్నట్లుంటుంది కానీ.. అతను చెప్పిన మాటలు మాత్రం చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. సన్నివేశం పూర్తయ్యాక మాత్రం హీరోయిన్ తండ్రి లాగే.. చూస్తున్న మనమూ ఆలోచనలో పడతాం. అలాగే హీరోయిన్ వచ్చి హీరో తండ్రిలో మార్పు తెచ్చే సీన్ కూడా అంతే బాగుంటంది.

పెళ్లిచూపులులాంటి పాథ్ బ్రేకింగ్ సినిమాలు అరుదుగా వస్తాయి. ఆనంద్.. ఉయ్యాల జంపాల లాంటి ఫీల్ గుడ్ సినిమాల్నిపెళ్లిచూపులుగుర్తుకుతెస్తుంది. వాటి కంటే కూడాపెళ్లిచూపులు మెట్టు పైనే ఉంటుంది కూడా. మల్టీప్లెక్స్ ఆడియన్స్ను టార్గెట్ చేసి తీసిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ.. వర్గం ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. అర్బన్ యూత్ సినిమాకు బాగా కనెక్టయ్యే అవకాశముంది. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్. సినిమాను నరేట్ చేసిన విషయంలో అతను పరిశ్రమకే కొత్త పాఠాలు చెప్పాడు. కథనం.. పాత్ర చిత్రణ విషయంలో తరుణ్కచ్చితంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడు.

దర్శకుడి ఆలోచనలకు నటీనటులు.. సాంకేతిక నిపుణులు ప్రాణం పోశారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని గొప్ప ఔట్ పుట్ ఇచ్చాయి. సినిమాలో విజయ్ దేవరకొండ, రితు వర్మ కాకుండా ప్రశాంత్, చిత్ర మాత్రమే కనిపిస్తారు. అంతలా పాత్రల్ని అవగాహన చేసుకుని అద్భుతంగా చేశారు హీరో హీరోయిన్లు. మిగతా సహాయ పాత్రల్లో అనీష్ కురువిల్లా, గురురాజ్ మానేపల్లి, ప్రియదర్శి, నందు.. వీళ్లందరూ కూడా చక్కగా నటించారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పేరు ఇకపై మన పరిశ్రమలో గట్టిగా వినిపించే అవకాశముంది. ఛాయాగ్రాహకుడు నగేష్ కూడా అంతే. వీళ్లిద్దరూ ఫీల్ గుడ్ సినిమాకు సరిగ్గా సరిపోయేలా హంగులద్దారు. టెక్నికల్గానూపెళ్లిచూపులుబ్రిలియంట్ అనిపిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన సినిమాపెళ్లిచూపులు’. ట్రైలర్ చూసి ఇది ఎలాంటి సినిమా అయి ఉంటుందో అంచనాతో.. ఆసక్తితో థియేటరుకి వచ్చే ప్రేక్షకుడినీ సినిమా నిరాశ పరచదు.

 

రేటింగ్: 3.5/5

Leave your comments

Post comment as a guest

0

People in this conversation