Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

'కబాలి' రివ్యూ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 3.00 (1 Vote)

కొన్నిసార్లు చాలా సీరియస్‌గా సాగే సినిమాలు కూడా కామెడీగా అయిపోతుంటాయి. భారీ అంచనాలతో థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడు.. తాను ఆశించింది తెరమీద కనిపించనపుడు ముందు అసహనానికి గురవుతాడు. ఇంకాస్త ముందుకెళ్లాక అడ్జస్ట్ అయిపోతాడు. ఇంకొంత సమయం గడిచాక ఇక సినిమాను మరో రకంగా ఎంజాయ్ చేయడం మొదలుపెడతాడు.

తెరమీద వ్యవహారం సీరియస్‌గా సాగుతుంటే ప్రేక్షకుడికి కామెడీగా అనిపిస్తుంది. కేరింతలు కొడుతూ.. గట్టిగా నవ్వుతూ.. కామెంట్లు చేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తుంటాడు. సమ్మర్లో ఆల్రెడీ ఒకటి రెండు భారీ తెలుగు సినిమాలు ప్రేక్షకులకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాయి. ఇప్పుడు కోవలోకేకబాలికూడా చేరింది.

కబాలిటీజర్లో రజినీ విశ్వరూపం చూసి యువ దర్శకుడు పా.రంజిత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. రజినీకాంత్‌ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడని.. ఆయనలోని ఎనర్జీని వాడుకుని తెరమీద అద్భుతాన్ని ఆవిష్కరించాడని అనుకున్నారంతా. కానీ రజినీని ఇలా ప్రెజెంట్ చేస్తాడని.. ఇలాంటి సినిమా తీస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘కబాలిలో సూపర్ స్టార్ పరిచయ సన్నివేశాలు చూసి రోమాలు నిక్కబొడుచుకోవడం అంటారే అలాంటిదే జరుగుతుంది. కానీ తర్వాత రోమాలే లోపలికి కుచించుకుపోతాయి. అంతగా ప్రేక్షకుడిని నీరసం ఆవహిస్తుంది. రజినీకాంత్ లాంటి ఎనర్జిటిక్ హీరోను పెట్టి.. ఆర్ట్ సినిమా తరహాలోకబాలిని ఆవిష్కరించాడు రంజిత్. రజినీ కెరీర్లో ఫ్లాపులుండొచ్చు గాక.. కానీ ఎందులోనూ రజినీ ఇంత డల్‌గా కనిపించలేదని మాత్రం నిస్సందేహంగా కనిపించొచ్చు. ప్రేక్షకులకు సరికొత్త రజినీని పరిచయం చేస్తూ క్లాస్ క్లాసిక్ మూవీ తీయాలనుకున్నాడు కాబోలు రంజిత్. కానీ అది విషయం లేని ఆర్ట్ సినిమాలాగా తయారైంది.

మలేషియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డ భారతీయుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఎంతో కష్టపడి దేశ అభివృద్ధికి పాటు పడితే.. భారతీయుల్ని బానిసల్లాగా చూస్తుంటారు అక్కడి పెద్దోళ్లు. ఇలాంటి సమయంలో వారిలోంచి నాయకుడు పుడతాడు. వారికి అండగా నిలుస్తాడు. పెద్దోళ్లతో పోరాడతాడు. ఐతే అక్కడి మాఫియాకు కంటగింపుగా మారుతుంది. నాయకుడికి సంబంధించిన వాళ్లందరినీ దెబ్బ తీస్తారు. అతణ్ని జైలుకు పంపిస్తారు. పాతికేళ్ల జైలు జీవితం పూర్తి చేసుకుని బయటికి వచ్చిన నాయకుడు.. తిరిగి మాఫియాకు ఎలా చెక్ పెట్టాడు.. తనకు దూరమైన తన వాళ్లను ఎలా కలుసుకున్నాడు అన్నదికబాలికథ.

ఒక మాఫియా డాన్.. అతడి జ్నాపకాలు.. అతడి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన.. అతడి మానసిక సంఘర్షణ.. ఇలా పూర్తిగా మరో తరహాలో నడుస్తుందికబాలి’. ఇది రజినీకాంత్ సినిమానేనా అని అడుగడుగునా సందేహాలు రేకెత్తిస్తూ.. ‘మనసుతో చూడాల్సినకళాత్మకసినిమాలాగా అనిపిస్తుంది. కథలో అంత విశేషమేమీ లేదు. ఐతే మలేషియా నేపథ్యాన్ని ఎంచుకోవడం.. పైగా రజినీకాంత్ లాంటి హీరో అందుబాటులో ఉండటంతో కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడానికి రంజిత్‌కు మంచి అవకాశమే లభించింది. కానీ అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అన్ని రజినీకాంత్ సినిమాలూరోబోలాగా రయ్యిన దూసుకెళ్లిపోవు. అలా ఆశించడం కూడా కరెక్ట్ కాదు. కానీ అంత వేగం లేకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాల నుంచి ప్రధానంగా ఆశించేది వినోదాన్నే. వినోదం పాళ్లే బాగా తక్కువైపోయాయికబాలిలో. నత్తనడకన సాగే కథనం.. ఆసక్తి లేని సన్నివేశాలు సినిమాను నీరుగార్చేశాయి. ప్రేక్షకుల్లో నీరసం నింపేశాయి. ఆరంభంలో కొంత ఎంటర్టైన్ చేసిన రజినీ తర్వాత దర్శకుడి చేతిలో బందీ అయిపోయాడు. ఏమీ చేయలేక ఉత్సవ విగ్రహంలాగా మారిపోయాడు. ఎంత రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఆయన్ని చూస్తూ కాలం గడిపేయలేం కదా.

అప్పుడప్పుడూ సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా కొంత ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేస్తే.. రజినీ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల్ని కాస్త అలరించే ప్రయత్నం చేశాడు. అంతే తప్ప కథనంలో విశేషం లేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు కొంచెం ఆసక్తి రేకెత్తించినా.. ద్వితీయార్ధంలో రజినీ తన భార్యను వెతుక్కుంటూ వెళ్లే ఎపిసోడ్‌తో సినిమా పూర్తిగా పక్కదోవ పట్టింది. ఇది దాదాపు ముప్పావుగంట పాటు సా….గే ఎపిసోడ్. రజినీ ముందు మలేషియాలో ఫ్లైట్ ఎక్కుతాడు. తర్వాత అడుగులో అడుగేసుకుంటూ ఎయిర్ పోర్టు నుంచి నడిచి బయటికి వస్తాడు. తర్వాత కారెక్కుతాడు. అక్కడి నుంచి హోటల్ గదికి వెళ్తాడు. భార్య ఫలానా చోట పని చేసేదని తెలిసి అక్కడికి పోతాడు. అక్కడ ఆమె లేదని తెలిసి యానాం వెళ్తాడు. అక్కడ విదేశీయులుండే కాలనీకి పోతాడు. రాత్రిపూట కాలనీలోకి అనుమతి లేదని తెలిసి వెనక్కి వెళ్తాడు. పడుకుని పొద్దున వస్తాడు. చివరికి ఎలాగోలా భార్యను చూస్తాడు. కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక్కడ ఎలా చెప్పుకుంటున్నామో.. తెరమీద అలాగే ప్రత్యేకతా సాగిపోతుంది ఎపిసోడ్. పావుగంటలో ముగించాల్సిన ఎపిసోడ్‌ను ముప్పావుగంట సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు రంజిత్. ప్రిక్లైమాక్స్.. క్లైమాక్స్ పర్వాలేదనిపించినా.. అప్పటిదాకా అనుభవించిన అసహనాన్ని అవి పెద్దగా తగ్గించలేవు.

రజినీని చూడటం కోసం కోసం.. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్స్కోర్ను.. మురళి ఛాయాగ్రహణాన్ని ఆస్వాదించడానికి మాత్రమేకబాలిచూడాలి. రజినీ మార్కు వినోదాన్ని ఆశిస్తే నిరాశ తప్పదు. రజినీ పాత్రే పకడ్బందీగా తీర్చిదిద్దలేదు. ఇక మిగతా పాత్రల గురించి.. నటీనటుల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రాధికా ఆప్టే ప్రతిభను దర్శకుడు సరిగా వాడుకోలేదు. ఆమెకున్న స్క్రీన్ టైం తక్కువే. విలన్ విన్స్టన్ చావో లుక్స్ బాగున్నాయి. నటనా బాగుంది. కానీ అతడి పాత్రా అంతంతమాత్రమే. సాంకేతిక విభాగాలన్నీ బాగానే పని చేశాయి. ఎటొచ్చీ దర్శకుడు పా.రంజితే తీవ్రంగా నిరాశ పరిచాడు. మామూలు సన్నివేశాల్ని కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరో స్థాయికి తీసుకెళ్లే రజినీని అతను ఉపయోగించుకోవడంలో ఫెయిలయ్యాడు. మొత్తంగాకబాలిబిగ్ డిజప్పాయింట్ అనడంలో సందేహం లేదు.

 

రేటింగ్- 2.25/5

Leave your comments

Post comment as a guest

0
  • No comments found