Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

అభినేత్రి "tutak tutak" వీడియో సాంగ్..

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

తమన్నా లీడ్ రోల్ లో నటించిన అభినేత్రి రిలీజ్ కి రెడీ అయిపోయింది. మూవీలో తమ్మూకి జోడీగా ప్రభుదేవా నటించగా.. సోనూసూద్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు.

వీళ్లిద్దరూ కేవలం యాక్టర్లు మాత్రమే కాదు.. నిర్మాతలు కూడా. తమిళ్ వెర్షన్ దేవి(ల్)కి ప్రభుదేవా సహ నిర్మాత అయితే.. హిందీ వెర్షన్ 2 ఇన్ 1కి సోనూసూద్ ప్రొడ్యూసర్. తెలుగు వెర్షన్ అభినేత్రిని కోన వెంకట్ నిర్మిస్తున్నాడు లెండి.

తమ సొంత చిత్రం కావడంతో ప్రభుదేవా-సోనూ సూద్ లు అభినేత్రి ప్రమోషన్స్ కి తెగ కష్టపడిపోతున్నారు. స్పెషల్ గా వీడియో సాంగ్ చేసి మరీ రిలీజ్ చేశారు. 'పీఛే హోజా సోణియే.. సాడీ రైల్ గడ్డీ ఆయీ' అంటూ సూపర్బ్ సాంగ్ ని రూపొందించేశారు. ప్రభుదేవా పాట అనగానే ఎలా ఉంటుందో.. ఎలా ఉండాలో అన్ని ఎలిమెంట్స్ పక్కాగా కుదిరాయి. పాటలో విచిత్రం ఏంటంటే.. సోనూ సూద్ తో తనతో సమానంగా స్టెప్పులు వేయించాడు ప్రభుదేవా. ప్రతీ స్టెప్ ని ప్రొఫెషనల్ డ్యాన్సర్ రేంజ్ లో అరుంధతి విలన్ చేసిన తీరు అధ్భుతహ అనడం చిన్న మాటే. పాటకి ఈషా గుప్తా అందాలు అదనపు బోనస్.

 

పబ్లిసిటీ సాంగ్ కోసం సోనూసూద్ కి బెండ్ తీసేశాడు ప్రభుదేవా. కేవలం ప్రమోషన్ కోసం చేసే పాటకి ఇంతగా కష్టపడిపోతున్నారంటే.. అదే మరి బాలీవుడ్ పబ్లిసిటీ టెక్నిక్స్ గొప్పదనం.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation