Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

చైతు బ్యాంగ్ బ్యాంగ్..మొదలైంది ఆకట్టుకుంటుంది

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీ సందడి పెరిగిపోతోంది. ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నపుడు మలయాళీ ప్రేమమ్ రీమేక్ సంగతులు తక్కువగానే బయటకొచ్చాయి.

అడపాదడపా తప్పిస్తే.. పెద్దగా వార్తల్లో నానింది కూడా లేదు. రిలీజ్ డేట్ గురించి మినహాయిస్తే.. అంతగా మీడియా ఫోకస్ కూడా పడలేదు. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీని విపరీతంగా ఆకర్షిస్తోంది ప్రేమమ్.

మొదట శృతి హాసన్ తో వీడియో ప్రోమో సాంగ్ ని విడుదల చేసిన ప్రేమమ్ యూనిట్.. ఇప్పుడు మడొన్నా సెబాస్టియన్ తో చైతు పాడుకునే 'బ్యాంగ్ బ్యాంగ్' ఆడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. లిరిక్ బాగా ఫాస్ట్ గా వెళ్లిపోతున్నా.. మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సాంగ్ లో చెప్పిన సంగతులు.. ప్రేమ ఫీలింగ్ ని కొత్తగా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగానే ఆకట్టుకుంటుంది. వీటికి తోడు.. ప్రేమమ్ షూటింగ్ కి సంబంధించిన పిక్స్ మరింతగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

 

సెప్టెంబర్ 20 తేదీన ప్రేమమ్ ఆడియో రిలీజ్ చేయనుండగా.. అప్పటివరకూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేందుకు.. దర్శకుడు చందూ మొండేటి ఐడియా బాగానే వర్కవుట్ అవుతోంది. సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెంచేసే వ్యూహంతోనే ఇలా పాటలను రిలీజ్ చేస్తుండగా.. టార్గెట్ ని ప్రేమమ్ టీం రీచ్ అయ్యేట్లుగానే ఉంది.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - arjit

    good application retail store, but this technique clearly just Kodi on iPhone information can be available to all, although as abovementioned, nice.

    0 Like Short URL: