Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

లెక్క తేలింది 80వేల కోట్ల ప్యాకేజీ!

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆంధ్రప్రదేశ్ను ఊరిస్తున్న ప్రత్యేక ప్యాకేజీపై క్లారిటీ చ్చేసింది. ప్యాకేజీకి ట్టుబడి ఉన్నట్లు చెప్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్ల ప్యాకేజి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం.

రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజికి ప్రధాని మోడీ అంగీకరించినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లు తెలిసిందికేంద్ర మంత్రి అరుణ్జైట్లీ సాయంత్రం ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2017తో దేశవ్యాప్తంగానేప్రత్యేక హోదాకు గడువు ముగుస్తుంది. ఇక నుంచి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ప్రధానమంత్రి సారథ్యంలోని  నీతిఆయోగ్నిర్ణయించింది. నేపథ్యంలో ఏపీకి సైతం ప్రత్యేక హోదా ఇవ్వద్దనే దిశలో కేంద్రం నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా  స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్యాకేజిపై కేంద్ర కసరత్తు కొలిక్కివచ్చింది. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి రూ.80 వేల కోట్లతో ప్యాకేజిగా రూపొందించారని మాచారం. వచ్చే నిధులను ఐదేళ్లపాటు రాష్ట్రానికి కేటాయించనున్నారు. ప్యాకేజిలో లోటుకు 15 శాతం, పరిశ్రమల రాయితీలకు 15 శాతం కేటాయించాలని పారిశ్రామికాభివృద్ధి చట్టంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఎఐబిపి, ఎయిడెడ్ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంట్లో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించనున్నాయి.   ఇందులో ప్రాజెక్టులకు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం స్పష్టంగా చెప్పబోతోంది. పోలవరానికి నూరుశాతం నిధులపై తన బాధ్యతేనని కేంద్రం ప్రకటించబోతోంది. నాబార్డు ద్వారా రుణం వచ్చే ఏర్పాటు చేసి అది కూడా తన బాధ్యతగా కేంద్రం తీసుకోబోతున్నట్లు చెప్పబోతోంది.

 

పరిశ్రమలకు రాయితీలపై రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని కేంద్రం ప్రకటించబోతున్నట్లు సమాచారం. పారిశ్రామిక రాయితీలతో పాటు పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం. రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన భరోసాను కేంద్రం ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రత్యేక హోదా నిధులు, సాధారణ నిధుల మధ్య ఉన్న 30 శాతం తేడాను ప్యాకేజిలో కేంద్రం కలపనుంది. కీలకమైన రాజధాని నిర్మాణంపైనా కేంద్రం స్పష్టంగా చెప్పబోతోందని ఢిల్లీ ర్గాలు అంటున్నాయి. రాజధాని నిర్మాణానికి నిధులు ఎంత ఇస్తారు? ఎప్పుడిస్తారనే సంగతి వెల్లడించబోతున్నారంటున్నారు. దీంతోపాటు లోటు భర్తీ పైనా స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found