Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

కేసు పెట్టిన 24 గంటల్లో ఆన్ లైన్ లో ఎఫ్ఐఆర్

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పుఒకటి వెల్లడించింది. ఏదైనా కేసును నమోదు చేసిన పోలీస్ స్టేషన్.. దాన్ని 24 గంటల వ్యవధిలో ఆన్ లైన్ లోకి లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఒకవేళ.. ఆయా రాష్ట్రాలకు సొంతంగా వెబ్ సైట్ లేనిపక్షంలో.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో వివరాల్ని నమోదుచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదేశంతో.. కేసులు నమోదైన అంశాలకు సంబంధించిన వివరాలు అవసరమైన వారు తెలుసుకునే అవకాశంతో పాటు పారదర్శకతకు అవకాశం ఇచ్చే వీలుంది.

తాము ఇస్తున్న ఆదేశాల్ని ఏడాది నవంబరు 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని సుప్రీం స్పష్టం చేసింది. అయితే.. ఇందుకు కొన్ని మినహాయింపుల్ని సుప్రీం ఇచ్చింది. భారతీయ యువ న్యాయవాదుల సంఘం వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్ని జారీ చేసింది. కేసును నమోదు చేసిన 24 గంటల్లో అన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సిన   విషయంలో ఏదైనా అనుకోని సాంకేతిక సమస్య ఎదురైతే 48 గంటల్లో అప్ లోడ్ చేసే సౌకర్యాన్ని ఇచ్చింది. ఒకవేళ ఏదైనా అసాధారణ ఘటన చోటు చేసుకున్న పక్షంలో మాత్రం అప్ లోడింగ్ కు 72 గంటల సమయాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలతో నిందితుడికి.. వారి తరఫు వారికి మేలు చేసే వీలుంది. పోలీసులు తమ మీద పెట్టిన కేసుల గురించి వివరంగా తెలుసుకోవటంతో పాటు.. కారణం మీద అరెస్ట్ చేశారన్నది వివరంగా తెలుసుకునేవీలుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ఎఫ్ఐఆర్ కాపీని పోలీసుల నుంచి సేకరించటం తలకు మించిన భారంగా మారింది. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ కాపీ పొందే వీలున్నా.. ప్రాక్టికల్ గా మాత్రం ఇబ్బందికర పరిస్థితులున్నాయి. దీనికి చెక్ పెట్టేలా సుప్రీం తాజా ఆదేశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

 

ఏదైనా కేసులో తనను ఇరికించారన్న సందేహం ఉన్న వారికి తాజా ఆదేశం మేలు జరిగే వీలుందని చెప్పొచ్చు. సాయుధ తిరుగుబాట్లు.. లైంగిక నేరాలు.. ఉగ్రవాదం సంబంధిత కేసులు.. మహిళలపై జరిగే లైంగిక నేరాల విషయంలో మాత్రం 24 వ్యవధిలో అప్ లోడ్ చేసే విధానానికి మినహాయింపు ఇచ్చారు. కేసులో ఉండే సున్నితత్వంతో పాటు..పేర్లు బయటకు రావటం ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో నిర్ణయం తీసుకున్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - Aria

    The best allotment about Moncler jackets is that you can cheap moncler calmly get them at abundant discounts on assorted online arcade websites. From 1952 to date Moncler has carved a different accession for itself in the alcove of exceptional accoutrement for men and women.Moncler jackets are http://www.cheapmoncleroutlet.co.uk">moncler outlet modish, well-cut, comfortable, failing and acutely warm. No amount how astringent the algid is, you can assurance Moncler jackets to accommodate able abundance during freezing winters too.cheap moncler jackets Online, Authentic Cheap Moncler Jackets On Sale:http://www.cheapmoncleroutlet.co.uk

    0 Like Short URL: