Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

హోదా అడిగితే పాఠాలు చెప్పిన మోడీ

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్లు ఉద్యమ రూపం ధరించిన నేపథ్యంలో  ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వం వాదను రింత బాగా వినిపించేందుకు సిద్ధవుతోంది.

రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయంపై కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధుల బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇదే విషయం మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఎంపీలు, పలువురు పార్టీ శాసన సభ్యులు, మాజీ ఎంపీలు కె.ఎస్.రావు తదితరులు ప్రధాన మంత్రి నివాసంలో నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినందుకు శాలువాతో సత్కరించారు. తరువాత పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి సన్మానించారు. సందర్భంగా నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించే మాటకు మోడీ పెద్ద పీట వేశారుఏపీ అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని మోడీ స్పష్టం చేశారు. ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎనలేని లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

మహారాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా గుజరాత్కు పలు సమస్యలు ఎదురయ్యాయని మోడీ చెప్పుకొచ్చారు.కేవలం రాష్ట్రంలోని ఉప్పు అమ్మి అభివృద్ధి సాధించామని ఆయ వివరించారు. పెద్దగా సహజ సంపద, ఖనిజ సంపద లేని గుజరాత్ పలు కష్టాలను ఎదుర్కొని అభివృద్దిని సాధించిందని గుర్తు చేశారు. ఎన్నో సహజ వనరులున్న ఏపీ అతి స్వల్ప వ్యవధిలోనే ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా డిమాండ్ వాడుకుంటోందని విమర్శించారు. ప్రతిపక్షం విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా అభివృద్దిపై దృష్టి సారించాలని రాష్ట్ర నాయకత్వానికి ప్రధాన మంత్రి సూచించారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున అందుతున్న ఆర్థిక సహాయంతో పెద్ద ఎత్తున అభివృద్దిని సాధించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిరంతర సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని మోడీ వ్యక్తం చేశారు.

 

ప్రధానమంత్రి ఇచ్చిన భారీ ప్యాకేజీ గురించి రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున వివరించాలని రాష్ట్ర బీజేపీ బృందాన్ని అమిత్ షా కోరారు. ప్యాకేజీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా సాధించలేనంత అభివృద్ధి ఆంధ్రలో గత రెండు సంవత్సరాల్లో సాధించటం జరిగిందని సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుందని ఆయన తెలిపారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation