Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

ప్ర‌క‌ట‌న...ప‌నిచేసే నాయ‌కులు కావ‌లెను?

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఒకడుగు ముందుకు..పది అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ రిస్థితిపై పార్టీ నేతలు అయోమయంలో డిపోతున్నారు. రాష్ట్ర విభజన బిల్లులోని హామీలు, ఏపీకి ప్రత్యేకహోదా అస్త్రం కలిసొచ్చినా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడంలేదు.

వైపు పార్టీలోని సీనియర్ నేతలు ఒకొక్కరుగా చేజారుతుంటే పార్టీలో ఉన్న సీనియర్లు సైతం పార్టీ బలోపేతంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం సీనియర్నేత కన్నా లక్ష్మినారాయణ బీజేపీలో చేరడంతో మొదలైన వలసల పరంపరం నేటికీ కొనసాగుతునే ఉంది. దీంతో వలసల నైరాశ్యం పార్టీలో కొనసాగుతుంటే పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యం పెంచేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాల పేరుతో కలియదిరుగుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటు వేదికగా చేసుకొని కాంగ్రెస్ సీనియర్నేత, రాజ్యసభసభ్యులు కెవిపి రామచంద్రరావు పోరాటం చేస్తున్నారు. కానీ పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నేతలు మాత్రం పార్టీ బలోపేతం కోసం ఒకఅడుగు ముందుకేవడం లేదన్న విమర్శలు పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితుల నేపథ్యంలో పార్టీని బతికించుకొనేదెలా అన్న సంసిగ్దతను కాంగ్రెస్ నాయకత్వం ఎదుర్కొంటోంది.

రాష్ట్ర విభజన అనంతరం పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు రుణ మాఫి విషయంలో, ఇతర అంశాలపైనా టీడీపీ సర్కార్పై పోరాటం చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై ఉద్యమిస్తోంది. అక్కడక్కడ పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలకు తప్పా మెజార్టీగా సీనియర్ నేతలు ఎవరూ ఏపీ కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించడంలేదన్న విమర్శలు పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సీనియర్నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటు వేదికగా నిరంతరం తన గళాన్ని వినిపిస్తూ పార్టీకి జీవం పోస్తున్నారు. వీరు తప్పా మిగితా సీనియర్ నేతలు తరహా కీలక ప్రాత పోషించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సైతం నేడు పార్టీకి అంటి అంటనట్లు ఉన్నారు. అయితే ఇటీవల మొదలైన కాపు ఉద్యమంకు మద్దతు తెలిపే కార్యక్రమాల్లో కాంగ్రెస్ తరపున ఆయన చరుగ్గా పాల్గొన్నా ఇతర పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన రకమైన చొరవ చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు  కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీకి అంటి అంటన్నట్లు ఉన్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ సైతం పార్టీ కార్యక్రమాలలో అనుకొన్నమేర ఉత్సాహంతో పాల్గొనడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కడపజిల్లాకు చెందిన మాజీ మంత్రులు డి.ఎల్.రవీంధ్రారెడ్డి, అహ్మదుల్లా సైతం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనలు గానీ నేతలతో మంతనాలు గానీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో గానీ పార్టీ పరంగా పాల్గొనడం లేదన్న విమర్శలున్నాయి. ప్రకాశంజిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహీధర్రెడ్డి కూడా పార్టీ బలోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మౌనంగా ఉండిపోతున్నారని అక్కడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వాసోతున్నాయి. నెల్లూరు జిల్లాలో పేరున్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ సీనియర్నేత టి.సుబ్బిరామిరెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దృష్టిసారించడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. గుంటూరుజిల్లాలో కాంగ్రెస్కు ఏకైక పెద్ద దిక్కుగా మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస పార్టీ అంతా ఖాళీ అవు తున్నా పట్టించుకోవడంలేదని, కార్యకర్తలో మనోధైర్యం నింపే ప్రయత్నం ఆయన చేయడం లేదన్న విమర్శలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొం టున్నారు. తూర్పు  గోదావరి నుంచి విశ్వరూప్, పశ్చిమ గోదావరి నుంచి వట్టి వసంత్కుమార్, విశాఖజిల్లా నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ ఇలా పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్న సీనియర్ నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ బలోపేతం దిశగా దృష్టిసారించకపోవడంపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తు న్నాయి.

 

త్వలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ల్లాది విష్ణు సైకిల్ ఎక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవ దేవినేని నెహ్రూ, కొద్దికాలం క్రితం నెల్లూరుజిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇలా చూస్తుంటే ఇంకెంత మంది వలసలు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు అన్నది అంచనాల్లో కాంగ్రెస్ హైకమాండ్ తలమునకలవుతోంది. నేపథ్యంలో ఏపి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో నిరంతరం చర్చిస్తూ వారు పార్టీని అంటిపెట్టుకొని ఉండేలా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు మాచారం.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation