Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

బాబుపై మరో కుంభకోణం

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరో ఆరోపణ తెరమీదకు వస్తోంది. శ్రీకాకుళం-విశాఖపట్నం జాతీయ రహదారిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా హడావిడి చేస్తుండటం వెనుక స్వంత లాభాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా హడావుడి పడటం ఇందుకు బలమైన కారణమని చెప్తున్నాయి.

టెక్నో - ఎకనమిక్ ఫీజిబిలిటీ (టిఇఎఫ్) స్టేటస్ నివేదిక అందజేయకుండా అక్కడ మౌలిక వసతుల పేర ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నాయి. పరిణామం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా శ్రీముఖంగా చెప్తున్నాయి.

రూ.2700 కోట్లతో 5132 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎలాంటి అనుమతులనూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకోలేదని తెలుస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు అథారిటీ చైర్మన్ అజయ్ జైన్ సమక్షంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన బిడ్డర్ల సమావేశానికి హాజరయ్యాయి. జీఎంఆర్ - జీవీకే - టాటా - రిలయెన్స్ సహా మరో నాలుగు సంస్థలు భోగాపురం ఎయిర్ పోర్టు (ఎయిర్ స్రిఫ్) నిర్మాణం కోసమని సమావేశానికి హాజరయ్యాయి. జీఎంఆర్ - జీవీకే గతంలో హైదరాబాద్ - బెంగళూరు ఎయిర్ పోర్టులను నిర్మించినప్పటికీ భోగాపురంలో ఎయిర్ పోర్టుకు వయబిలిటీ లేదని సమావేశం నుంచీ రెండు సంస్థలూ బయటకు వచ్చేశాయి. టాటా - రిలయన్స్ లతో పాటు పాల్గొన్న మిగతా సంస్థలకూ గతంలో ఎయిర్ పోర్టుల నిర్మాణంలో అనుభవం లేనందున వాటి బిడ్లను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. దీంతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అనుమతులపై ప్రశ్నార్థకం తలెత్తింది.

 

అయితే మొత్తం ఎపిసోడ్ లో టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు కీలకంగా మారింది. రిపోర్ట్ పరిధిలోకి అనేక కీలక అంశాలు వస్తాయి. అవి విమాన సర్వీసులను నడిపితే ఎయిర్ పోర్టు కంపెనీకి లాభమా? నష్టమా? భోగాపురంలో రూ.2700 కోట్లు పెట్టుబడి పెట్టి వేల ఎకరాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాక వచ్చే లాభం ఏమిటి? అంటే కాస్ట్ వర్సెస్ ఇన్ కం (వ్యయం-ఆదాయం) నిష్పత్తి చెప్పాలి. ప్రాంతం అనుకూలమా? కాదా?.. 2013 భూసేకరణ చట్టం ఫాలో అయ్యారా? లేదా? సామాజిక ప్రభావం ఏమిటి? అక్కడ నుంచి తరిమేయబడ్డ ప్రజల ఆహార భద్రత సంగతేంటి? సామాజిక భద్రత కోణంలో ఒక ఎకరా పోగొట్టుకునే కుటుంబం తర్వాత కూడా గతం కంటే మెరుగ్గా జీవించగల పరిస్థితి ఇవ్వగలరా? సదుపాయాలను ఎలా సమకూర్చగలుగుతారు? ఉపాధి - ఉద్యోగ సదుపాయాల మాటేమిటి? తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా నివేదిక కోరింది. అంతేకాకుండా...సంవత్సరానికి 25 లక్షల మంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటేగానీ ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణం వల్ల ఉపయోగం ఉండదన్నది మరో వాదన. ఇది జరగాలంటే మరో పదేళ్లు పడుతుందన్నది తెలుస్తోంది. ప్రకారం రోజుకు 8 వేల మంది ప్రయాణించాలి. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఇప్పుడు రోజుకు 3500 మంది ప్రయాణిస్తున్నారు. కొత్తగా భోగాపురంలో ఏర్పడితే 8 వేల మంది వస్తారా? అన్నది కూడా కేంద్రం కొర్రీకి ఒక కారణంగా ఉందని సమాచారం.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - qwq

    The New York-based affluence covering goods, the Coach replica handbags .Anne Hathaway can absolutely prove the abundance of the Coach cast of handbags.Delicate beautiful handbags consistently can advice avant-garde ladies become the focus in the street, abnormally the dior replica handbags acclaimed branded bags.When you are searching for your bargain Coach handbags online, you will decidedly acquisition that there are abounding on-line food alms altered mulberry replica prices. Finding Coach replica artist bargain handbags is actual benign in such an economical environment.

    0 Like Short URL: