Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

జగన్ భలే పాయింటు పట్టుకున్నాడే!

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

రాజకీయాలన్నాక నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులలో నిత్యం లోపాల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి ఆరోపణలు ఏదో కావాలని చేస్తున్న పసలేని ఆరోపణల్లాగా కనిపిస్తూ ఉంటాయి.

మరికొన్ని సందర్భాల్లో అందులో చాలా గొప్ప పాయింటు ఉందనిపిస్తుంటుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన హడావుడి ఆర్భాటం గురించి.. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి గుర్తించిన ఒక పాయింటు అదే రీతిగా.. జనంలో మన్నన పొందుతోంది. జగన్ భలే పాయింటు పట్టుకున్నారే అని జనం అనుకుంటున్నారు.

కొన్ని రోజులుగా చంద్రబాబునాయుడు రాయలసీమ కరువు కాటకాలను మొత్తం చేత్తో తుడిచిపెట్టేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. రెయిన్ గన్లతో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నానంటూ టముకు వేసుకున్నారు అని వైకాపా శ్రేణులు ఆరోపిస్తూ ఉంటాయి. మొత్తానికి అనంతపురం కేంద్రంగా చంద్రబాబునాయుడు రాయలసీమ కరువు మీద చాలా సుదీర్ఘమైన ఎపిసోడ్ ను నడిపించారు.

 

అయితే ఇప్పుడు జగన్మోహనరెడ్డి అందులో కీలకాంశం గురించి విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు.. నేరుగా వెళ్లడానికి సాధ్యం కాదు గనుక.. నాయకులు హెలికాప్టర్ లో పరిశీలించడం జరుగుతుందని.. అదే కరవు కాటకాలు వచ్చినప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని ఊరడిస్తే బాగుంటుంది గానీ.. కరువను కూడా హెలికాప్టర్ లోంచి చూడడం ఏంటని విమర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు అనంతపురం కేంద్రంగా.. ఉండి హెలికాప్టర్ లో కరవు పరిస్థితుల్ని విహంగ వీక్షణం చేశారు. అప్పట్లో లోతు తెలియలేదు గానీ.. జగన్ చెబుతోంటే.. అవును కదా.. కరవులో ఏడుస్తున్న వారిని చూడడానికి ఎండిన పంటలను చూడడానికి ఎండిన పంటలను చూడడానికి హెలికాప్టర్ లో తిరగడంలో అర్థం లేదు కదా అని జనం అనుకుంటున్నారు.

Leave your comments

Post comment as a guest

0

People in this conversation

  • Guest - Ange

    "It's a Chanel day bag - a around-the-clock classic. If you had chanel replica 50 in the shop, you'd acquaint all 50,"says Nathan Finch, managing ambassador of Pickwick pawnbrokers.Some types of Chanel haversack models are aswell able to bender to gucci replica handbags your atramentous dress.Chanel handbags is to try eBay or added commensurable online adjustment sites. In the sites if your bid is the highest, you can still acceptance the Chanel haversack at clumsily mulberry replica uk abounding lower aggregate than the listed price.Chanel handbags are the a lot of accustomed casting name which is discussed a allotment of a lot of of the women.

    0 Like Short URL: