Call Us: 85000-26363 / 85000-26464

Trendy:

సమ్మె పోటుతో బస్సులు బంద్

1 1 1 1 1 1 1 1 1 1 Rating 0.00 (0 Votes)

భారత్ బంద్ తో శుక్రవారం దేశం బోసిపోయింది. 18 కోట్లమందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రవాణా, టెలికాం వంటి అత్యవసర సర్వీసులకు అంతరాయం కలిగింది.

విద్యుత్, బొగ్గు, జౌళి, ఆటో మొబైల్, స్టీల్, రక్షణ రంగాలపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, భెల్ వంటి సంస్థలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయని 10 కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.

 

ఇక తెలంగాణా, ఎపీలలో అనేక చోట్ల బస్సులు తిరగక ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. సింగరేణి లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తం 12 డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారు. తమ కనీస వేతనాలు 18 వేలకు పెంచాలని, కనీస పెన్షన్ 3 వేలు చేయాలని వీరు ప్రధానంగా కోరుతున్నారు.

Leave your comments

Post comment as a guest

0
  • No comments found